English | Telugu

మ‌హేష్ ఆశ‌ప‌డ్డ 'మ‌గాడు'

ఇంత‌కీ మ‌హేష్ బాబు - కొర‌టాల శివ సినిమా టైటిల్ ఏమిటి?? శ్రీ‌మంతుడు, మ‌గాడు ఈ రెండింటిలో ఏది ఫిక్స్ చేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు అభిమానులు ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోస‌మే ఎదురుచూస్తున్నారు. మ‌హేష్ - కొర‌టాల శివ సినిమా చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. ఈనెల 31న ట్రైట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ చిత్రానికి మగాడు అనే టైటిల్ పెట్టార‌ని ముందుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర‌వాత శ్రీ‌మంతుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి శ్రీ‌మంతుడు పేరే ఫిక్స‌నుకొన్నారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ చిత్ర‌బృందం మ‌న‌సు మార్చుకొని మ‌గాడు టైటిల్ వైపు దృష్టిసారిస్తోంద‌ట‌. శ్రీ‌మంతుడు అయితే క్లాసీగా ఉంద‌ని, మ‌గాడు అయితే మాస్‌కి త్వ‌ర‌గా చేరిపోతుంద‌ని మహేష్ భావిస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు మ‌హేష్ అభిమానులు కూడా 'మ‌గాడు' టైటిల్ బాగుంది.. అదే పెట్టేయండి.. అంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నార‌ట‌. అయితే కొర‌టాల శివ‌కు మాత్రం `శ్రీ‌మంతుడు` టైటిల్ పైనే గురి ఉంది. 'మ‌గాడు' అనే టైటిల్ కూడా మ‌రో నిర్మాణ సంస్థ ఆల్రెడీ రిజిస్ట‌ర్ చేయించుకొంది. తార‌క‌ర‌త్న క‌థానాయ‌కుడిగా మ‌గాడు అనే పేరు తో ఓ సినిమా తెర‌కెక్కి.. మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఇప్పుడు టైటిల్ ఇవ్వ‌డానికి వాళ్లు బెట్టు చేస్తున్నారు. మ‌హేష్ మ‌న‌సు ప‌డినా ఆ టైటిల్ మాత్రం చేజిక్కించుకోలేక‌పోతున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.