English | Telugu

కట్టిపడేసేలా కన్నప్ప లవ్ సాంగ్!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన శివ శివ శంకర పాట, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. (Kannappa)

విష్ణు, ప్రీతి ముకుందన్ కనిపించే "సగమై.. చెరిసగమై" అంటూ సాగే ఈ పాటను సోమవారం విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ ను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు బాగుంది. ప్రభు దేవా, బృందా కొరియోగ్రఫీ మెప్పించింది. ఇక విష్ణు-ప్రీతి ముకుందన్‌ను మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.

శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్నారు. విష్ణు కన్నప్పగా, ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.