English | Telugu
విజయ్ పొలిటికల్ ఎంట్రీపై లోకేష్ ఫోకస్!
Updated : Oct 12, 2023
దళపతి విజయ్ నటించిన సినిమా లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష నటించారు. అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. లియోకి అంత పెద్ద క్రేజ్ ఉంది జనాల్లో. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌ని చెన్నైలో చేద్దామని అనుకున్నారు. దళపతి పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ టైమ్‌లో చెన్నైలో ఈవెంట్ చేసి, జనాలను అదుపు చేయలేకపోతే, దళపతి పొలిటికల్ కెరీర్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అందులోనూ నెగటివ్ ఇంపాక్ట్ ఇప్పుడు అవసరమా అన్నది దళపతి వర్గాల్లో వినిపించిన మాట. మొన్నామధ్య ఎ.ఆర్.రెహమాన్ ఈవెంట్ సరిగా ఆర్గనైజ్ చేయలేకపోవడంతో విపరీతంగా విమర్శలు ఎదురయ్యాయి. తాను అలాంటి విమర్శలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు దళపతి విజయ్. అందుకే లియోకి సంబంధించిన చెన్నై ఈవెంట్‌ని లాస్ట్ మినిట్‌లో కేన్సిల్ చేయించారు.
ఇప్పుడు సినిమాకు ప్రమోషనల్ ఈవెంట్ ఇంపార్టెంట్. ఈ టైమ్‌లో అసలు ఈవెంటే చేయకపోయినా ఇబ్బందే. అందుకే కాస్త వెరైటీగా ఈ సారి లియో ఈవెంట్‌ని హైదరాబాద్‌లో అద్భుతంగా ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ కార్యక్రమంలో లోకేష్ కనగరాజ్, అనిరుద్ రవిచంద్రన్‌తో పాటు అందరూ పాల్గొంటారట. ఈ వేడుక మీద అనిరుద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, శాంతి మాయాదేవి, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ తోపాటు పలువురు ఈసినిమాలో నటించారు. ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. ఇంకో రెండు పాటలను విడుదల చేయాల్సి ఉంది.