English | Telugu
భగవంత్ కేసరి ప్రభంజనం.. 2 గంటల 35 నిమిషాలు
Updated : Oct 12, 2023
యువరత్న నందమూరి బాలకృష్ణ అమ్ముల పొదిలో నుంచి వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా మీద నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమా మీద వాళ్ళ అంచనాలని రెట్టింపు చేసింది. ఇప్పుడు ఈ సినిమా నిడివికి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
బాలయ్య సినిమా వస్తుందంటే చాలు ఆ ముందు రోజు రాత్రి నుంచే థియేటర్స్ దగ్గర అభిమానుల హంగామా మొదలవుతుంది. అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలవుతాయి. వెండి తెర మీద బాలయ్య నటవిశ్వరూపం చూసి అభిమానులు ఆనందం తో పులకరించిపోతారు. ఇప్ప్పుడు వాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యేల భగవంత్ కేసరి మూవీ యొక్క నిడివి రెండు గంటల 35 నిమిషాలు ఉండబోతుంది. దీంతో తెర మీద బాలయ్య విశ్వరూపాన్ని అభిమానులు మరింత ఎక్కువగా వీక్షించవచ్చని తెలుస్తుంది.
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శత్వం లో తెరకెక్కతున్న ఈ మూవీ ని 155 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే సుమారు 2 గంటల 35 నిమిషాలు పాటు భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది. థమన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమా లోని పాటలన్ని సూపర్ డూపర్ హిట్ గా నిలిచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగిపోతున్నాయి. కాజల్ ,శ్రీ లీల,అర్జున్ రామ్ పాల్ ,శరత్ కుమార్ తదితరులు నటిస్తున్న భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా ఈ నెల 19 న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. షైన్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై సాహు గారపాటి హరీష్ పెద్ది లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.