English | Telugu
మహేష్ ఛాన్స్ కొట్టేసిన లహరి
Updated : Mar 28, 2014
మహేష్ నటిస్తున్న "ఆగడు" చిత్ర ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ భారీమొత్తంలో చెల్లించి దక్కించుకుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఇందులో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్ర పాటలను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.