English | Telugu
మహేష్ అండ్ రామ్ చరణ్ హీరోయిన్ కి ఇండియా తరుపున ఆహ్వానం
Updated : May 14, 2024
ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో ప్రతీ ఏడాది చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. వాటి నామధేయం కేన్స్ ఫిలిం ఫెస్టివల్. వరల్డ్ మొత్తంలో విడుదలైన అన్ని చిత్రాలు అక్కడ ప్రదర్శించబడతాయి. దాంతో సదరు సినిమాలకి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి కేన్స్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ ఉత్సవాలకి అతిధిగా హాజరవుతున్న అతిధి విషయం టాక్ అఫ్ ది డాట్ గా నిలిచింది
కియారా అద్వానీ.. తెలుగు, హిందీ చిత్ర సీమలో ఉన్న క్రేజీ హీరోయిన్స్ లో ఒకటి. ఎంత అందంగా ఉంటుందో నటన కూడా అంతే అందంగా ఉంటుంది. ఆల్రెడీ శ్రీమతి గా కూడా మారింది.ఇప్పుడు ఈమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 కి సంబంధించి భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహిస్తుంది. రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.కియారా అద్వానీ తో పాటు సల్మా అబు దీఫ్, సరోచా చంకిమ్హా, అధ్వా ఫహద్, అసీల్ ,రమతా టౌలే సై లు అందులో సభ్యులుగా ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఆరుగురు ప్రతిభావంతులైన మహిళలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోభితా ధూళిపాళ, మరియు అదితి రావ్ హైదరీ వంటి వారు ఆ వరుసలో ఉన్నారు
ప్రతి సంవత్సరం మే నెలలో కేన్స్ చిత్రోత్సవాలు జరుగుతాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించిన జ్యూరీలో సభ్యురాలిగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే ఉంది.ఐశ్వర్య.రాయ్ జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి . 2003 లో ఆ ఘనతని సాధించింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా గతంలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా హాజరు అయ్యింది. ఇక కియారా 2018 లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ నేను అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యింది. ఆ తర్వాత చరణ్ తో వినయవిధేయ రామలో నటించింది.
ఆ చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించకపోయినా ప్రస్తుతం చరణ్ తోనే గేమ్ చేంజర్ చేస్తుంది