English | Telugu
ఓటీటీలోకి అనసూయ తమిళ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Updated : May 14, 2024
అనసూయ భరద్వాజ్.. అందరికి సుపరిచితమే. జబర్ధస్త్ షోకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు హోస్ట్‌గా వ్యవహరించింది అనసూయ. 2022లో ఈ షోకు గుడ్‌బై చెప్పింది. అనసూయ స్థానంలో ప్రస్తుతం జబర్ధస్త్ షోకు సిరి హనుమంతు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
తెలుగులో పలు సినిమాలు చేసింది అనసూయ. క్షణం, రంగస్థలం, పుష్ప, రంగమార్తండ, విమానం, పెదకాపు వంటి సినిమాల్లో విభిన్న పాత్రలతో మెప్పించింది. ఈ ఏడాది తెలుగులో 'రజాకార్'లో కనిపించింది. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని, తమిళ సినిమా చేయాలని అనసూయ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. తమిళంలో " ఫ్లాష్‌బ్యాక్ " పేరుతో అనసూయ ఓ మూవీ చేసింది. ప్రభుదేవా హీరోగా నటించిన ఈ సినిమాలో రెజీనా, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఈ మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.
తాజాగా థియేటర్లలో కాకుండా నేరుగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తెలియజేయలేదు. ఫ్లాష్‌బ్యాక్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు డాన్ సాండీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ప్రభుదేవా రచయిత పాత్రలో కనిపించబోతున్నాడు. ఆంగ్లో ఇండియన్ గా రెజీనా కనిపించనున్నది. ఈ మూవీలో అనసూయ పాత్ర స్పెషల్ అని తెలుస్తోంది.