English | Telugu
కియారకు మేకప్ అవసరమే లేదా?
Updated : Apr 8, 2023
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మొన్నటికి మొన్న కియారా అద్వానీ కశ్మీర్ నుంచి ఫొటోలు పెడుతుంటే, అందరూ భర్త సిద్ధార్థ్‌తో కలిసి ట్రిప్‌కి వెళ్లారేమో అనుకున్నారు. అయితే కియారా వెళ్లింది ట్రిప్ కి కాదని, ఆమె వర్క్ మోడ్‌లో ఉన్నారని అర్థమైంది. కియారా అద్వానీ, కార్తిక్ ఆర్యన్ కలిసి హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. సత్యప్రేమ్‌కి కథ అనే ఆ సినిమాను ప్రస్తుతం కశ్మీర్‌లో చిత్రీకరిస్తున్నారు. మంచు కొండల్లో, మంచు నిండిన సోన్ మార్గ్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. అక్కడ పనిలో పనిగా షూటింగ్ చేస్తూనే, ఫొటో షూట్లు కూడా బాగానే చేశారు కియారా అద్వానీ. ఈ సత్య ప్రేమ్ కి కథ కశ్మీర్ షెడ్యూల్ పూర్తి కావడంతో ముంబైకి తిరిగి వచ్చారు. రిటర్న్ జర్నీలో కియారాతో పాటు ముంబై ఎయిర్‌పోర్టులో దిగారు కార్తిక్ ఆర్యన్. కార్తిక్ స్వీట్ షర్ట్, డెనిమ్స్ వేసుకున్నారు. అటు కియారా డెనిమ్స్, కార్డిగన్, బూట్స్ వేసుకున్నారు. ఆమె లుక్‌కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎయిర్‌పోర్ట్ లుక్స్ లో కియారా అద్వానీని బీట్ చేసే వారు లేరంటున్నారు.
కియారా అద్వానీ ముంబై ఎయిర్‌పోర్టు లుక్కుని ఓ పేపరాజీ షేర్ చేశారు. ఫ్లైట్ దిగిన ఆమె పార్కింగ్‌కి వెళ్లేదారిలో నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ ``ఆమెకు మేకప్ అసలు అవసరమే లేదు. అసలు కొంచెంలో కొంచెం కూడా అక్కర్లేదు. ఆమె కళ్లల్లోనే ఓ వెలుగు ఉంటుంది. నవ్వుల్లో ఉన్న వెలుగు ఆమె కళ్లల్లో కనిపిస్తుంది`` అని రాశారు. మన దగ్గర మేకప్ అక్కర్లేని ఏకైక నటి ఆమె మాత్రమే అని మరో ఫ్యాన్ కామెంట్ చేశారు. ఎప్పుడూ అందంగా కనిపిస్తుందని ఒకరు రాస్తే, ఎప్పటికప్పుడు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో ఆమెను మించిన వారు లేరు అని మరొకరు స్టేట్‌మెంట్ ఇచ్చారు. సౌత్‌లో ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ.