English | Telugu
వరుణ్‌ధావన్‌తో రవితేజ... నార్త్ లో వైరల్ అవుతున్న సౌత్ హీరోలు!
Updated : Apr 8, 2023
నిన్నటిదాకా సక్సెస్ స్ట్రీక్ మీదున్నారు రవితేజ. లేటెస్ట్ గా ఆయన నటించిన రావణాసుర విడుదలైంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తోంది. కానీ నార్త్ లో మాత్రం రవితేజ పేరు గట్టిగానే ట్రెండ్ అవుతోంది. ధమాకా, వాల్తేరు వీరయ్యతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు రవితేజ. రావణాసుర కూడా 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని అందరూ అనుకున్నారు. శింబు నటించిన మానాడు సినిమా రీమేక్‌లో వరుణ్‌ధావన్‌తో పాటు రవితేజ కూడా నటిస్తారన్నది లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాను తెలుగులోనూ, హిందీలోనూ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ్‌లో ఈ సినిమాలో శింబు, ఎస్‌జె సూర్య కలిసి నటించారు.
మానాడు తమిళ్‌లో చాలా పెద్ద హిట్ అయింది. బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగానూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. స్క్రీన్ ప్లే పరంగా చాలా మంచి మెచ్చుకున్న సినిమా ఇది. వెంకట్‌ప్రభు తమిళ్‌లో తెరకెక్కించారు. ఇప్పుడు హిందీ, తెలుగులో తెరకెక్కితే క్రాస్ బార్డర్ సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. రవితేజ నటించిన తెలుగు సినిమాల హిందీ వెర్షన్లకు మంచి ఆదరణ ఉంది. ఆయన నటించిన కిక్ సినిమాను సల్మాన్ తెరకెక్కంచారు. అక్కడ కూడా హిట్ అందుకున్నారు. అటు వరుణ్ ధావన్ కూడా సౌత్ సినిమాల్లో నటించాలని ఉందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆయన నటించిన బవాల్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు రవితేజకు హిందీ మాట్లాడటం చాలా బాగా వచ్చు. ఆయన పంజాబీని కూడా అనర్గళంగా మాట్లాడుతారు. అమితాబ్ బచ్చన్‌కి రవితేజ పెద్ద ఫ్యాన్. ఆయనకు నార్త్ సినిమాల మీద, నార్త్ మార్కెట్ మీద, నార్ట్ ప్రేక్షకుల అభిరుచుల మీద కూడా మంచి అవగాహన ఉంది.