English | Telugu
కత్రీనా గౌన్ల ఖరీదు కోటి రూపాయలు
Updated : Jul 5, 2014
హృతిక్ రోషన్, కత్రీనా కలిసి నటిస్తున్న బాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ ఫిలిం బ్యాంగ్ బ్యాంగ్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలయ్యింది. ఈ సినిమాలో తన జీవితంలో ఎప్పుడూ వేసుకోనంత ఖరీదైన దుస్తులు ధరించిందట కత్రీనా. అనాయితా ష్రాఫ్ డిజైన్ చేసిన దుస్తులు దర్శకులకు నచ్చక పోవడంతో మరో డిజైనర్ గ్రేవిన్ మిగ్వేల్ తో రెండు డ్రెస్సులు డిజైన్ చేయించారట. ఎరుపు, ఆరెంజ్ రంగులలో వున్న ఈ రెండు గౌన్లకు ఆయన వసూలు చేసింది కేవలం కోటి రూపాయలేనట.
అవును మీరు చదివినది కరెక్టే. ఆ డబ్బు వుంటే ఓ చిన్నపాటి సినిమా తీసేద్దాం అనుకునే వాళ్లు మన దగ్గర చాలా మంది వున్నారు. అదలా వుంచితే, ఈ గౌన్లకు బిల్లు పడింది ప్రొడ్యూసర్ కే కదా, అని తీసిపారేయకండి. ఈ డ్రెస్సులకు అయిన ఖర్చు కత్రీనాయే భరించిందట. చిత్ర బడ్జెట్ ఇప్పటికే బాగా పెరిగిపోతోందట. సినిమా సీక్వెన్స్ కి తగిన కాస్టూమ్స్ విషయంలో ఫిలిం మేకర్స్ రాజీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, అలా కాంప్రమైజ్ కాకుండా ఇలా కోటి రూపాయలు ఖర్చు పెట్టిందట కత్రీనా. కోటి రూపాయలకన్నా క్వాలీటీ చాలా ముఖ్యం అంటోందట.