English | Telugu
కమల్ క్లారిటీతో తేజాకు షాక్
Updated : Jul 7, 2014
జాతీయ స్థాయి ఉత్తమ నటుడు కమల్ హాసన్ తెలుగు దర్శకుడు తేజాతో ఒక చిత్రం చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. చాలా రోజులుగా తెలుగు సినిమాల ఊసే ఎత్తని తేజా సడెన్ గా కమల్ హాసన్ తో సినిమా తీసేస్తున్నాడంటా ఫిలింనగర్ లో టాకు మొదలైందిం. ఈ వార్తపై కమల్ స్పందించారు. తానే ఏ చిత్రం ఇంకా ఒప్పుకోలేదని తేల్చేశారు. శుభసంకల్పం తర్వాత కమల్ తెలుగులో ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆయన తన సొంత బ్యానరు రాజ్ కమల్ ఇంటర్నేషనల్‌లోనే తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఏమైనా ప్రస్తుతం 3 సినీ ప్రాజెక్టలతో బిజీగా వున్న కమల్ హాసన్ తెలుగులో తేజాతో సినిమా తియ్యట్లేదని మాత్రం తేలిపోయింది.