English | Telugu
మళ్లీ తుపాకీ పట్టిన కమల్ హాసన్
Updated : Sep 8, 2023
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన టైటిల్ పాత్రలో నటించిన విక్రమ్ సినిమా ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్ కె చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. మరో వైపు ఆయన హీరోగా వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అందులో ముందుగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాక్షన్ చిత్రాలను తెరకెక్కించటంలో డైరెక్టర్ వినోద్‌కి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇప్పుడు అదే పంథాలో ఆయన కమల్ హాసన్ సినిమాను కూడా యాక్షన్ థ్రిల్లర్‌గానే ఆవిష్కరించనున్నారు.
ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లటానికి ముందు కమల్ హాసన్ గన్ షూటింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందులో మిషన్ గన్ సహా డిఫరెట్ టైప్స్ గన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సినిమా మొదలు కాకుండానే అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. KH 233 వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాకు రైజ్ టు రూల్ అనేది ట్యాగ్ లైన్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే ప్రముఖ కమెడియన్ యోగిబాబు కూడా నటిస్తున్నారు. త్వరలోనే ఇందులో హీరోయిన్ ఎవరు? అనే విషయాలను మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
KH 233 షూటింగ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. మరో వైపు కమల్ హాసన్ ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనె నటిస్తోన్న ప్రాజెక్ట్ Kలో ప్రతినాయకుడిగా మెప్పించబోతున్నారు. KH 233, ప్రాజెక్ట్ K రెండు చిత్రాలు వచ్చే ఏడాదిలోనే అలరించబోతున్నాయి.