English | Telugu

లేట్ వయసులో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు!

సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి లైఫ్ టర్న్ అవుతుందో తెలియదు. సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తున్నా రాని క్రేజ్, ఒక్క సినిమాతో ఒక్కసారిగా రావొచ్చు. అలా లేట్ వయసులో క్రేజ్ తెచ్చుకొని, వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటులు కొందరున్నారు. ఆ కొందరు నటుల్లో తమిళ నటుడు జార్జ్‌ మరియన్‌ ఒకరు.

థియేటర్ ఆర్టిస్ట్ అయిన జార్జ్‌ మరియన్‌.. 20 ఏళ్ళ క్రితం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2002 లో విడుదలైన 'ఆజాగి' అనే సినిమాతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. అయితే ఆయనకు గుర్తింపు రావడానికి మాత్రం దాదాపు ఆరేళ్ళు పట్టింది. 2008లో విడుదలైన 'కాంచీవరం'తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'పోయి సొల్ల పోరోమ్', 'మద్రాస పట్టినం', 'దైవ తిరుమగల్', 'శైవం' వంటి సినిమాలతో తన ప్రతిభను చాటుకున్నారు. అయితే జార్జ్‌ మరియన్‌ ప్రతిభకు తగ్గ బిగ్ బ్రేక్ రావడానికి మాత్రం ఏకంగా 17 ఏళ్ళు పట్టింది.

కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఖైదీ'. 2019లో విడుదలైన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో నెపోలియన్ అనే కానిస్టేబుల్ పాత్ర పోషించారు జార్జ్‌ మరియన్‌. ఆ సినిమాకు ఎంత పేరు వచ్చిందో, ఆయన పోషించిన ఆ నెపోలియన్ పాత్రకి కూడా అంతే పేరొచ్చింది. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆయనకు బడా అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఆయన పోషిస్తున్న నెపోలియన్ పాత్ర కీలకం. 'ఖైదీ'లో అదరగొట్టిన ఆ పాత్ర లియో లోనూ అలరించింది. భవిష్యత్ లో ఈ యూనివర్స్ లో భాగంగా రానున్న సినిమాల్లో ఆయన పాత్ర మరింత కీలకం కానుంది అంటున్నారు. దీనితో పాటు 'ఇండియన్-2' సహా పలు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు జార్జ్‌ మరియన్‌. కాస్త ఆలస్యంగా ప్రతిభకు తగ్గ గుర్తింపు తెచ్చుకున్న 60 ఏళ్ళ ఈ నటుడు, ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .