English | Telugu
కేజిఎఫ్ యష్ సరసన సాయి పల్లవి
Updated : Dec 5, 2023
ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా యష్ కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తుంది.వాళ్ళందరి కోసం ఈ నెల ఎనిమిదవ తేదీన యష్ తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నాడు.ఆ రోజే ఆ సినిమా దర్శకుడు బ్యానర్ తో పాటు హీరోయిన్ ఎవరనేది కూడా ప్రకటించబోతున్నారు.కానీ ఈ లోపే యష్ సినిమాలో చెయ్యబోయే హీరోయిన్ గురించి ఒక వార్త బయటికి వచ్చింది .రావడమే కాదు ఇప్పుడు ఆ వార్త ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తుంది.
యష్ 19 గా తెరకెక్కతున్న ఆ మూవీలో యష్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా చెయ్యబోతుందనే టాక్ చాలా బలంగా వినపడుతుంది. ఇదే కనుక జరిగితే ఈ ప్రాజెక్ట్ ఇండియాలోనే సంచలన ప్రాజెక్ట్ గా నిలబడటం ఖాయం. ఎందుకంటే సాయి పల్లవి కి ఇప్పుడు అన్ని బాషల్లోను మంచి నటి అనే గుర్తింపు ఉంది.పైగా తన నటనతో తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.యష్ ఆల్రెడీ కేజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే కనుక ఆ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లో సరికొత్త రికార్డు లు సృష్టించడం ఖాయం.ఆల్రెడీ ఇద్దరు కలిసి హిందీలో తెరకెక్కే రామాయణంలో నటించబోతున్నారు.రణబీర్ కపూర్ రాముడు పాత్రలో కనిపిస్తుండగా సీతగా సాయిపల్లవి రావణాసురుడుగా యష్ నటిస్తున్నారు.
సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తండేల్ లో నటిస్తుంది. యష్ సాయి పల్లవిల కొత్త చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించబోతుంది. ఈమె 2014 లో హిందీలో అబద్దాలు పాచికలు అనే సినిమాని తెరకెక్కించారు. అలాగే 50 కి పైగా చిత్రాల్లో నటిగా కూడా నటించింది. కేవిఎన్ ప్రొడక్షన్ పై యష్ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది.