English | Telugu
మధ్యలోనే వదిలేశాడు: జుహీ
Updated : Mar 11, 2014
దాదాపు నాలుగేళ్ళుగా కోమాలో ఉన్న జుహీ చావ్లా అన్నయ్య బాబీ చావ్లా గత ఆదివారం తుది శ్వాస విడిచారు. సోదరుడి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న జుహీ తన మనోభావాలను తెలియజేస్తూ.... నా పెళ్ళయిన ఏడాదికే మా అమ్మ చనిపోయింది. అపుడు ప్రపంచం తలకిందులైనట్లుగా అనిపించింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు నాన్న కూడా అనారోగ్యంతో ఆయన కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అమ్మ చనిపోయాక బాబీ నాకు అండగా ఉండేవాడు. చిన్నప్పుడు ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. పెద్దయిన తర్వాత మా ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. జీవితాంతం తను నాకు అండగా ఉంటాడనుకున్నాను కానీ ఎలా మధ్యలో వదిలేశాడు. నా జీవిత భాగస్వామి జై ఇపుడు నాకు పెద్ద అండ. తను, నేను, మా ఇద్దరు పిల్లలు... ఇప్పుడు ఇదే నా జీవితం. వాళ్ళు లేని జీవితాన్ని నేను ఊహించలేను" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.