English | Telugu
నిర్ణయాలు తీసుకుంటున్న రుద్రమదేవి
Updated : Mar 11, 2014
అనుష్క, రానా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం "రుద్రమదేవి". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ప్రముఖ కళాదర్శకుడు తోట తరణి వేసిన రాజదర్బార్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన సామంత రాజులతో రుద్రమదేవి మాట్లాడి, కొన్ని నిర్ణయాలను తీసుకొనే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 5 వరకూ కొనసాగే ఈ షెడ్యుల్ లో అనుష్క, రానా, సుమన్, కృష్ణంరాజు, హంసానందిని వంటి ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఇందులో నిత్యామీనన్, కేథరిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.