English | Telugu
'ఎన్టీఆర్ 30' సర్ ప్రైజ్ వచ్చేసింది.. ఊహించని లుక్ లో జాన్వీ కపూర్!
Updated : Mar 6, 2023
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఎన్టీఆర్ 30'కి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ప్రీలుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
నేడు(మార్చి 6) జాన్వీ కపూర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు.. ఆమె 'ఎన్టీఆర్ 30'లో నటించనుందన్న విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్న జాన్వీ లుక్ ఆకట్టుకుంటోంది. ఎక్కువగా మోడ్రన్ దుస్తుల్లో కనిపించే జాన్వీ.. పోస్టర్ లంగావోణీ ధరించి కొత్తగా కనిపిస్తోంది. పోర్ట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ వయొలెంట్ కనిపించనుండగా, జాన్వీ సాఫ్ట్ గా కనిపించనుందని తెలుస్తోంది.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది.