English | Telugu

తెలుగు సినిమాకు మా డైరెక్టర్ నందిని మేడం ఓహ్ బేబీనే

నందిని రెడ్డి..ఒక బోల్డ్ లేడీ డైరెక్టర్. "అలా మొదలయ్యింది" అనే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని అందించి ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న ఒక గొప్ప డైరెక్టర్. నాని, నిత్యా మీనన్ తో కలిసి చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ ఒక్క సినిమాతో నందిని రెడ్డి సక్సెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. నందిని రెడ్డి ఎంతో మందికి ఇన్స్పిరేషన్..రీసెంట్ గా ఆమె తన బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకున్నారు. బుల్లితెర నటీనటులు మాత్రమే కాదు సిల్వర్ స్క్రీన్ యాక్టర్స్ కూడా ఈమెకు విషెస్ చెప్పారు. ఇక తాగుబోతు రమేష్ కూడా ఆమెను విష్ చేశారు.

"తెలుగు సినిమాకు మా డైరెక్టర్ నందిని మేడం ఓహ్ బేబీనే..మెనీ మరి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే" అంటూ నందిని రెడ్డితో కలిసి దిగిన స్టిల్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. ఇక తాగుబోతు రమేష్ జగడం, అలా మొదలైంది, 100% లవ్, గుండెజారి గల్లంతయ్యిందే, ఈగ వంటి మూవీస్ లో నటించి అలరించారు. ఇప్పుడు జబర్దస్త్ లో వెంకీ మంకీస్ టీమ్ లో కంటెస్టెంట్ గా స్కిట్స్ వేస్తూ అలరిస్తున్నాడు. ఇక నందిని రెడ్డి ప్రస్తుతం "అన్ని మంచి శకునములే" అనే మూవీని తెరకెక్కించారు. ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంట నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

‘లిటిల్ సోల్జర్స్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందిని రెడ్డి. అలాగే సమంత కూడా నందిని రెడ్డిని చాలా స్పెషల్ గా విష్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో నీలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా ఉండాలి ఎందుకంటే నువ్వెప్పుడూ బాధలు దగ్గరకు రానివ్వవు.. బాధ పడాల్సిన సమయంలోనూ నవ్విస్తుంటావ్ అని పోస్ట్ చేసింది.