English | Telugu
చిరు కోసం కోల్ కతా సెట్!
Updated : Feb 10, 2023
గతంలో చిరంజీవి నటించిన ఇంద్ర, చూడాలని ఉంది, జై చిరంజీవ వంటి పలు చిత్రాలలో పాటల కోసం భారీ భారీ సెట్స్ వేశారు. చూడాలని ఉంది చిత్రంలో కోల్కతా సెట్ వేయగా ఇంద్ర సినిమాలో కాశీని చూపించారు. వినాయకుడి విగ్రహంపై జై చిరంజీవ చిత్రంలో ఓ పాటను చిత్రీకరించారు. ఇవన్నీ చిరంజీవి చిత్రాలకు మామూలే. ఒరిజినల్ లొకేషన్ లోకి వెళ్లకుండా వాటికి తగ్గ సెట్స్ నిర్మిస్తూ ఆయన చిత్రాలు తీస్తూ ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ స్థలాలలో తీస్తే ఇక జనాలను ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్‌లో ఉన్నారు. వాల్తేరు వీరయ్యతో సంక్రాంతి విన్నర్‌గా నిలిచారు. బ్లాక్ బస్టర్ హిట్టును దక్కించుకున్నారు. సంక్రాంతి విజేతగా నిలిచారు. రికార్డు స్థాయి వసూళ్లు సాధించారు. ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేశారు. బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. సరైన కథ పడితే పూనకాలు తేవడం గ్యారంటీ అని నిరూపించారు. తనకంటూ ఒక మాంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ పడితే ఆ బొమ్మ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పాత రికార్డులను దుమ్మురేపుతుందని చిరు మరోసారి నిరూపించుకున్నారు.
ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. అదే ఉత్సాహంతో ప్రస్తుతం ఆయన బోళాశంకర్ మూవీ చేస్తున్నారు. తమిళంలో వచ్చిన వేదాలం కు ఇది రీమేక్ .తమన్నా హీరోయిన్ కాగా చిరంజీవి చెల్లెలు గా కీర్తిసురేష్ నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజా షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతుంది. ఇక హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన కోల్కతా సెట్ లో ఓ కీలకపాటని చిరుతోపాటు 200 మంది డ్యాన్సులు పాల్గొనగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఇక ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. వైజాగ్ సత్యానంద్ కదా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందులో ఇంకా వెన్నెల కిషోర్, అర్జున్ దాస్, రష్మి గౌతమ్, తులసి వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి కోల్కతా సెట్ లో వేసిన పాట ప్రత్యేక ఆకర్షణ కానుందని పలువురు భావిస్తున్నారు. ఈ స్థాయిలో సెట్స్ వేసి తీసిన చిరంజీవి చిత్రాలన్నీ ఎక్కువగా మంచి విజయాలనే నమోదు చేశాయి. దాంతో ఈ కోల్కతా సెట్ అనేది చిరుకి సెంటిమెంట్ గా కూడా వర్కౌట్ అవుతుందని ఆశించవచ్చు.