English | Telugu
నాని అభిమానులకి 24 న పండుగ
Updated : Nov 21, 2023
కొన్ని సినిమాలు విడుదలకి ముందే ప్రేక్షకుల్లో ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్ ని కలిగిస్తాయి. సినిమా ఫస్ట్ లుక్,టీజర్,సాంగ్స్,ఇలా మూవీ విడుదలకి ముందు ఆ మూవీకి సంబంధించి జరిగే అన్నికార్యక్రమాలు కూడా ఇక ఈ సినిమా హిట్ అనే ఒక వైబ్రేషన్ ని ప్రేక్షకులుకి కలిగిస్తాయి. అలాంటి ఒక చిత్రమే హాయ్ నాన్న. నాచురల్ స్టార్ నాని హీరో గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి నాని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఆనందాన్ని కలుగ చేస్తుంది.
హాయ్ నాన్న మూవీ ట్రైలర్ 24 న విడుదల కాబోతుంది.ఈ మేరకు చిత్రబృందం అధికారకంగా ప్రకటించింది. ట్రైలర్ ఎలా వుండబోతుందనే ఒక ఉత్కంఠత నాని అభిమానుల్లో ఆడియన్స్ లో ఉంది. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి విడిపోయిన చెరుకూరి మోహన్ ఇంకో ఇద్దరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హేషం అబ్దుల్ వహీద్ సంగీతం అందించగా బేబీ కియారా కీలక పాత్రలో నటిస్తుంది.
నాని ప్రస్తుతం హాయ్ నాన్న రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్ పనుల్లోఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త రీతిలో హాయ్ నాన్న ప్రమోషన్స్ జరుగుతున్నాయి. హాయ్ నాన్న అనే రాజకీయ పార్టీని కూడా నిర్మించిన నాని ప్రేక్షకులకి ఇటీవలే కొన్ని వాగ్దానాలు కూడా చేసాడు. 24 న విడుదల అయ్యే ట్రైలర్ ద్వారా కూడా నాని ఏమైనా వాగ్దానాలు ఇస్తాడేమో చూడాలి.