English | Telugu

మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా రిలీజ్ గురించి ఎలాంటి న్యూస్ బయటకి రాకపోవడంతో 'అక్టోబర్‌ 1' విడుదలపై అనేక సందేహాలు మొదలయ్యాయి. కానీ ఆరు నూరైనా అనుకున్న టైమ్ కే గోవిందుడు వస్తాడని ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు నిర్మాత బండ్ల గణేష్. అలాగే యువన్ శంకర్ రాజా అందించిన సంగీతాన్ని ఈ నెల 15న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం డిఐ కూడా పూర్తయిందట. రెండో భాగానికి సంబందించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి ఎమోషనల్ క్లయిమాక్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రంతో కృష్ణవంశీ మళ్లీ తమ స్టామినా చూపిస్తాడట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.