English | Telugu

ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి బిగ్ సర్‌ప్రైజ్!

మరే స్టార్ హీరోకి సాధ్యంకాని విధంగా వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఇటీవల 'కల్కి 2898 AD'తో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకొని, ఫ్యాన్స్ కిక్ ఇచ్చాడు. ఆ కిక్ నుంచి ఫ్యాన్స్ బయటకు రాకముందే మరో సర్ ప్రైజ్ కి రెడీ అయ్యాడు.

ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'రాజా సాబ్' (Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. 'కల్కి' తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ఇదే. ఇప్పుడు ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. రేపు(జూలై 29) సాయంత్రం 5:03 కి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'రాజా సాబ్'లో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారని మూవీ టీం తెలిపింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.