English | Telugu
'సన్నాఫ్ సత్యమూర్తి'కి దాసరి సడన్ గెస్ట్!!
Updated : Mar 17, 2015
సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన దర్శకరత్న దాసరి నారాయణ రావు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. అసలు మెగా ఫంక్షన్ కు దాసరి గెస్ట్ గా వచ్చేసరికి ఆశ్చర్యపోవడం మెగా ఫ్యాన్స్ వంతైంది. ఒక పక్క చిరు, రామ్ చరణ్ లకు దాసరితో గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటప్పుడు ఆయనను బన్నీ ఆడియో గెస్ట్ గా ఎలా ఆహ్వానించాడు అన్నది మెగా అభిమానుల ప్రశ్న? అయితే ఇదే విషయంపై ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది.
సన్నాఫ్ సత్యమూర్తి నిర్మాత రాధాకృష్ణ, దాసరి మధ్య మనీ లావాదేవీలు వున్నాయట. దాంతో వారు మొహమాటానికి దాసరిని పిలవకతప్పలేదట. అయితే మొదట ఆడియో ఫంక్షన్ కి రావడానికి అంత ఆసక్తి చూపని దాసరి, సడన్ గా రావాలని డిసైడ్ అయ్యారట.తాను పెద్దగా మాట్లాడనని, రెండు నిమషాలు మాత్రమే ప్రసంగిస్తానని అన్నారట. అయితే అక్కడికి వచ్చిన దాసరి తన మాటలతో మెగా ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆడియో ఫంక్షన్లో స్టైల్ అంటే పవన్‌దే అంటూ దాసరి నారాయణరావు చేసిన కామెంట్లు అందరికి ఇబ్బందికరమైన వ్యవహారంగా తయారైంది.