English | Telugu

అఖిల్‌కి నాన్న దొరికాడు

ఈ మ‌ధ్య తెలుగు తెర‌పై నాన్న పాత్ర‌ల‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. యువ క‌థానాయ‌కులే కాదు, సీరియ‌ర్ హీరోల సినిమాల్లోనూ నాన్న పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు ద‌ర్శ‌కులు. దాంతో హీరో, హీరోయిన్ల‌కు స‌రిపోయే నాన్న‌ల‌ను వెదికిప‌ట్టుకోవ‌డం ద‌ర్శ‌కులకు కాసింత క‌ష్టంగా మారింది. ఈ పాత్ర‌కు ఇది వ‌ర‌కు నాన్న అన‌గానే ప్ర‌కాష్‌రాజ్ గుర్తొచ్చేవారు. ఇప్పుడు స‌రికొత్త ప్రత్యామ్న‌యాలు దొరికేస్తున్నాయి. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌కాష్‌రాజ్ కి గ‌ట్టి పోటీ ఇస్తే.. ఇప్పుడు రాజేంద్ర ప్ర‌సాద్ కూడా రెఢీ అంటున్నాడు. 'శ్రీ‌మంతుడు'లో మ‌హేష్‌బాబుకి నాన్న‌గా న‌టిస్తున్నారు న‌ట‌కిరీటి. ఇప్పుడు.. అఖిల్‌కీ ఆయ‌నే నాన్న‌. అఖిల్ - వినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో అఖిల్‌కి నాన్నగా రాజేంద్ర ప్ర‌సాద్‌ని ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ టీమ్‌తో రాజేంద్ర ప్ర‌సాద్ కూడా జాయిన్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.