English | Telugu

ఎర్రబస్సులో దాసరి మనవరాలు రాక


150 చిత్రాల దర్శకుడు దాసరి రూపొందిస్తున్న 151వ చిత్రంలో ఆయన మనవరాలు నీరాజిత నటించనుంది. తాతా మనువల కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి దాసరి దర్శకత్వం వహించడంతో పాటు తాతగా కూడా నటిస్తున్నారు.
తాతా మనవళ్ల కథ చిత్రంతో దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిన దాసరి తాతాగా నటిస్తున్న ఈ చిత్రంతో ఆయన మనవరాలు తెరకు పరిచయం కావడం విశేషం. ఈ చిత్రంలో మనువడిగా మంచు విష్ణు నటిస్తున్నాడు. కేథరిన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన మంజ పై చిత్రం ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎర్రబస్సు అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.