English | Telugu

మహేష్ కిడ్నాప్‌కి మహేష్ పర్మిషన్


టాలీవుడ్ లో ఈ మధ్య ప్రయోగాత్మక చిత్రాల ఒరవడి కొంత పెరిగిన క్రమంలో రూపొందుతున్న చిత్రం ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. సూపర్ స్టార్ మహేష్ బాబుని కిడ్నాప్ చేసే అంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి విచిత్రమైన ఇబ్బంది ఎదురవుతోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్లో వుంది. సినిమా అంతా సజావుగా పూర్తి చేసుకున్న వీరికి సెన్సార్ కత్తిరింపుల బెడద వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చి వుంటే సినిమా యూనిట్ సర్దుకునేది. కానీ సెన్సార్ వారు మహేష్ బాబు కిడ్నాప్ చుట్టూ అల్లుకున్న ఈ కథకి మహేష్ పర్మిషన్ వుందా అని అడిగారట. ఊహించని ఈ ప్రశ్నకి సినిమా రూపకర్తలు తెల్లమొహం వేశారట. ప్రిన్స్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలా మహేష్ కిడ్నాప్ అంశంతో రూపొందుతున్న చిత్రానికి మహేష్ పర్మిషన్ లేకపోవటం ఇప్పడు అడ్డంకిగా మారింది.
కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నందు, తేజస్విని, వెన్నెల కిషోర్, శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్‌ తదితరులు నటిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.