English | Telugu

రామ్ సేఫ్.. మళ్ళీ చిరు వర్సెస్ బాలయ్య!

సినిమాలు చెప్పిన తేదీ కంటే ఆలస్యంగా విడుదల కావడం సహజం. అయితే చెప్పిన తేదీ కంటే ముందు రావడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా విషయంలో అదే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 20 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' కారణంగా రామ్ మూవీ ప్రీపోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఈ సినిమాకి ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని, ఫైనల్ అవుట్ పుట్ రావడానికి కనీసం మరో మూడు నెలలు పట్టే అవకాశముందని, అందుకే ఈ సినిమాని దసరాకు వాయిదా వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్-బోయపాటి మూవీ పరిస్థితి మరోలా ఉంది. ఈ సినిమా ముందే పూర్తవుతున్నా, సరైన తేదీకి విడుదల చేయాలన్న ఉద్దేశంతో దసరా సీజన్ ని టార్గెట్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే దసరాకు నటసింహం నందమూరి బాలకృష్ణ 'NBK 108'తో వస్తున్నాడు. ఇక ఇప్పుడు 'భోళా శంకర్' కూడా దసరాకు వచ్చే అవకాశం ఉండటంతో, రామ్-బోయపాటి చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

ఆగస్టు 11వ తేదీ రామ్ సినిమాకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆ సమయంలో తెలుగులో బడా సినిమాల పోటీ లేదు. పైగా మూడు రోజు వీకెండ్ తో పాటు ఐదో రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే కూడా కలిసొస్తుంది. రామ్ అయితే సేఫ్ అవుతాడు కానీ, మిగతా సినిమాల దసరా బాక్సాఫీస్ సంక్రాంతిని మించి ఉండేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో బాలకృష్ణ, 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి బరిలోకి దిగారు. ఈ హోరాహోరి పోరులో బాలయ్య సూపర్ హిట్ కొట్టగా, చిరు బ్లాక్ బస్టర్ కొట్టి పైచేయి సాధించాడు. దసరాకు మరోసారి వీరు బాక్సాఫీస్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మరోవైపు 'టైగర్ నాగేశ్వరరావు'తో మాస్ మహారాజ రవితేజ కూడా దసరాకే రానున్నాడు. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .