English | Telugu

లోబోకి జైలు శిక్ష..తీర్పు వెల్లడించిన కోర్టు

పలు తెలుగు చిత్రాలతో పాటు, టెలివిజన్ షోస్ ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు 'లోబో'(lobo). ప్రధానంగా కామెడీ క్యారెక్టర్స్ లో కనిపించే లోబో, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో పాటు పలువురు అగ్ర హీరోలతో సన్నిహితంగా ఉంటాడు. బిగ్ బాస్(Big Boss)సీజన్ 5 లో కంటెస్ట్ గా కూడా పాల్గొని ఎక్కువ రోజులు హౌస్ లో ఉన్నాడు.

లోబో 2018 వ సంవత్సరంలో 'తెలంగాణ'(Telangana)లోని జనగామ(Jangaon)జిల్లా పరిధిలో ఉన్న 'నిడిగొండ' వద్ద తన కారుతో ఒక ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మృతి చెందారు. దీంతో లోబో పై పోలీసులు కేసు నమోదు చేయగా, అప్పట్నుంచి సదరు కేసు జనగామ జిల్లా కోర్టు పరిధిలో ఉంది. రీసెంట్ గా కోర్టు లోబోకి ఏడాది పాటు జైలు శిక్షతోపాటు, 12,500 రూపాయల జరిమానా విధిస్తు తీర్పుని ప్రకటించింది. లోబో అసలు పేరు మహ్మద్ ఖయ్యూమ్(Mohammed Khayyum).స్వస్థలం 'హైదరాబాద్'(Hyderabad)కాగా టాటూ పార్లర్ ని కూడా నిర్వహిస్తుంటాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.