English | Telugu

సీనియర్ సినిమాటోగ్రాఫర్ కి మెగాస్టార్ ఆర్ధిక సాయం!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ ‏కు రూ. 5 లక్షల ఆర్ధిక సాయం చేశారు. 1980-90 లలో ఆయన టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో కలిపి 300 కు పైగా సినిమాలకు పని చేశారు. చిరంజీవి నటించిన 'రాణి కాసుల రంగమ్మ', 'టింగు రంగడు', 'పులి బెబ్బులి', 'నాగు' వంటి సినిమాలకు ఆయన కెమెరామన్ గా వ్యవహరించారు. సినిమాటోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో పాటు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి దేవరాజ్ ‏కు రూ. 5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. దీంతో చిరంజీవిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.