English | Telugu
నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. 'బ్రీత్' ఫస్ట్ లుక్ అదిరింది!
Updated : Mar 5, 2023
నందమూరి కుటుంబం నుంచి మరో కొత్త హీరో వస్తున్నాడు. ఆ కుటుంబంలో ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. హరికృష్ణ, తారకరత్న నటులుగా ఆకట్టుకున్నారు కానీ స్టార్స్ కాలేకపోయారు. కళ్యాణ్ రామ్ ఉన్నంతలో బాగానే రాణిస్తున్నాడు. ఇక ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మరో నటుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అతనే నందమూరి చైతన్య కృష్ణ.
ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడైన చైతన్య కృష్ణ 'బ్రీత్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. తాజాగా కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. వర్షంలో గొడుగు పట్టుకొని నిల్చొని ఉన్న చైతన్య లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని చూస్తుంటే ఇదొక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అనిపిస్తోంది. మరి తన మొదటి చిత్రంతో చైతన్య కృష్ణ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.