English | Telugu

మంచు మనోజ్ కి ఊహించని షాక్.. మా బతుకులతో ఆడుకోవద్దు..!

కొంతకాలంగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వైపు, మంచు మనోజ్ మరో వైపు అన్నట్టుగా వివాదం నడుస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆస్తి పంపకాలు అని మొదట ప్రచారం జరిగింది. కానీ మనోజ్ మాత్రం, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న సమస్యల గురించి విద్యార్థులు తరపున తాను గళం వినిపిస్తున్నందుకే.. తనని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. మొదట ఈ గొడవ హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద జరిగి ఆ తర్వాత సద్దుమణిగింది. మళ్ళీ ఇటీవల తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద వివాదం జరిగింది. ఈ క్రమంలో తాజాగా మనోజ్ కి ఊహించని షాక్ తగిలింది. యూనివర్సిటీ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మనోజ్ తీరుని తప్పుబడుతున్నారు. తమ కడుపులు కొట్టొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు, లెటర్ లు విడుదల చేస్తున్నారు. (Manchu Manoj)

మనోజ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ తాజాగా రంగంపేట సర్పంచ్ ఎర్రయ్య ఒక వీడియో విడుదల చేశాడు. "ఈ ప్రాంతంలో మా భూముల ధరలు పెరగడానికి కారణం మోహన్ బాబు గారు. ఆయన వల్ల ఎందరో ఉపాధి పొందుతున్నారు. హాస్టల్స్ నడుపుతున్నారు. ఈ చుట్టు పక్కల ఎవరికి ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు గారి దగ్గరకే వెళ్తాము. మనోజ్ గారు మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేసి, మా కడుపులు కొట్టొద్దు." అని వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇక యూనివర్సిటీ ప్రాంతంలోని హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక లేఖను విడుదల చేసింది. "మోహన్ బాబు గారి విద్యాలయాల వల్ల మేము ఇక్కడ హాస్టల్స్ కట్టుకొని కుటుంబాల్ని పోషించుకుంటూ సంతోషముగా బ్రతుకుతున్నాము. స్టూడెంట్స్ కి హాస్టల్ యాజమాన్యంతో కానీ, యూనివర్సిటీ యాజమాన్యంతో కానీ ఎటువంటి సమస్యలు లేవు. ఏమైనా చిన్నా చితక సమస్యలు వచ్చినా మోహన్ బాబు గారికి లేదా విష్ణు గారికి చెప్పుకుంటాము.. వారు సామరస్యంగా పరిష్కరిస్తారు. మనోజ్ గారు.. మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మీరూ మీరూ పరిష్కరించుకోండి. మధ్యలో మమ్మల్ని లాగకండి. మా తరపున మాట్లాడుతున్నట్టు అబద్దాలు చెప్పకండి. మీ స్వార్థం కోసం మా బతుకులతో ఆడుకోకండి, మమ్మల్ని రోడ్డు మీదకు లాగకండి." అని లేఖలో పేర్కొన్నారు.

మరి ఈ వీడియో మరియు లెటర్ పై మనోజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .