English | Telugu

ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ కి కిక్ ఇచ్చిన బాలకృష్ణ 

గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ నందమూరి 'బాలకృష్ణ'(Balakrishna)విజయాల్నిమాత్రమే తన చిరునామాగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే రెట్టించిన ఉత్సాహంతో 'అఖండ 2 'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'అఖండ' మొదటి భాగాన్ని మించిన శివతాండవం 'అఖండ 2'(Akhanda 2)లో ఉండబోతుందనే విషయం ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'అఖండ 2 ' కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ రీసెంట్ గా 'ముంబై'(Mumbabi)లోని వడలా ఏరియాలో ఉన్న 'ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ'(Andhra Education society)ని సందర్శించాడు. విద్యార్థులు ఉన్న అన్ని తరగతి గదుల్లోకి వెళ్లి వాళ్లలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, వాళ్ల దగ్గర్నుంచి పలు ప్రశ్నలకి సమాధానాలు రాబట్టడం జరిగింది. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా బాలకృష్ణతో సంభాషించారు. ఆ సందేశాలు విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు బండ్లమూడి రామ్మోహన్, జనరల్ సెక్రటరీ కృష్ణప్రసాద్ తో పాటు పలువురు టీచర్స్ పాల్గొన్నారు. బాలకృష్ణ సందర్శన విద్యార్థులకు ఒక చిరస్థాయి జ్ఞాపకంగా నిలిచిపోతుందని వారు తెలిపారు.

ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ 1943 లో స్థాపించడం జరిగింది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యని భోదిస్తుండగా, సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు నాణ్యమైన విద్యని అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. బాలకృష్ణ ఇటీవల ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో బెల్ ని మోగించిన విషయం తెలిసిందే.ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కూడా నిలిచాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.