English | Telugu

అందుకే రిటైర్‌ అయిన తర్వాతే ఇండస్ట్రీకి వచ్చాను : ‘బలగం’ మురళీధర్‌

ఈమధ్యకాలంలో మంచి ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్న ఏకైక సినిమా ‘బలగం’. యెల్దండి వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమాకి అవార్డుల పంట పండటం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇందులోని ప్రతి పాత్రా ప్రేక్షకుల్ని హత్తుకునేదే, ప్రతి సన్నివేశం చక్కని అనుభూతిని కలిగించేదే. సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా అల్లుడు నారాయణ పాత్రను పోషించిన మురళీధర్‌గౌడ్‌కి చాలా మంచి పేరు వచ్చింది. దానితోపాటు అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నటుడుగా బిజీ అయిపోయారు మురళీధర్‌. తను సినిమాల్లోకి రావడం ఎలా సంభవించింది, దానికోసం ఎలా తపన పడిరదీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు మురళీధర్‌ గౌడ్‌.

‘ఒక కళాకారుడికి తన ప్రతిభ నిరూపించుకోవాలని, పది మందితో శభాష్‌ అనిపించుకోవాలని ఉంటుంది. నటుడు కావాలన్న కోరిక ఉన్నవారికి వేరే దేని మీదా ఆసక్తి ఉండదు. ఇది చాలా మంది విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే నాకు నటించాలనే కోరిక ఉన్నప్పటికీ కేవలం పేదరికం కారణంగానే ఆ కోరికను అణుచుకుంటూ వచ్చాను. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. నేను ఉద్యోగం చేసేవాడిని. నేను జాబ్‌ చేయడం నా కుటుంబానికి చాలా అవసరం. డబ్బు సంపాదించుకోవడానికి నాకు అది తప్ప వేరే మార్గం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి రావడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చినా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే రిటైర్‌ అయిన తర్వాతే ఇండస్ట్రీకి వచ్చాను. నా అదృష్టం బాగుండి మంచి క్యారెక్టర్లు పడడం, నటుడిగా మంచి గుర్తింపు రావడం జరిగింది. నాలోని నటుడు సంతృప్తి చెందడానికి ‘బలగం’ వంటి ఒక్క సినిమా చాలు’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.