English | Telugu

నాగచైతన్య సంగతేంటో ఆరోజు తేలిపోతుంది!

అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన మొదటి వెబ్ సిరీస్ 'దూత'. ఈ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని ఇటీవల న్యూస్ వినిపించింది. తాజాగా ఇదే విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది.

గతేడాది 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు చైతన్య ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ ని డిసెంబర్ 1 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అమెజాన్ ప్రైమ్ అనౌన్స్ చేసింది. "మిస్టరీనా మెసేజా అనేది మీరు త్వరలోనే తెలుసుకుంటారు" అంటూ స్ట్రీమింగ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. చైతన్య గొడుగు పట్టుకొని ఉండగా, అక్షరాలు వర్షపుధారలా పడుతున్నట్టు పోస్టర్ ని క్రియేటివ్ గా డిజైన్ చేశారు. ఆ అక్షరాలలో పలు ప్రమాద ఘటన వార్తలు కనిపిస్తున్నాయి. మరి ఇది మిస్టరీనా? మెసేజా? అసలు ఈ 'దూత' సంగతేంటో తెలియాలంటే డిసెంబర్ 1 వరకు ఆగాల్సిందే. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్ లు ఉంటాయని, ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమషాల వంతున ఉంటుందని సమాచారం.

చైతన్య, విక్రమ్ కాంబినేషన్ లో గతంలో 'మనం', 'థ్యాంక్యూ' సినిమాలు వచ్చాయి. అందులో 'మనం' ఘన విజయం సాధించగా, 'థ్యాంక్యూ' పరాజయం పాలైంది. మరి ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న సిరీస్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. మరోవైపు చైతన్య ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. అతను నటించిన గత రెండు చిత్రాలు 'థ్యాంక్యూ', 'కస్టడీ' నిరాశపరిచాయి. దీంతో ఓ మంచి విజయంతో హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తన 23వ సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. మరి ఈలోపు చైతన్య 'దూత'తో డిజిటల్ లో సక్సెస్ టేస్ట్ చేస్తాడేమో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.