English | Telugu

తన భార్య అసలు రూపం ఇదే అంటున్న బిగ్గెస్ట్ డైరెక్టర్ 

తమిళ చిత్ర దర్శకుడు అట్లీ ఇటీవలే షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీతో ఇండియన్ సినిమా దర్శకుడుగా మారిపోయాడు. ఆ మూవీ 1000 కోట్లు కలెక్షన్స్ ని కూడా సాధించడంతో ఒక్కసారిగా అట్లీ పేరు మారుమోగిపోయింది. దీంతో ఆయనకీ హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అట్లీ డైరెక్షన్స్ లో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అందరు ఎదురుచూస్తున్న వేళ తన భార్య గురించి అట్లీ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

అట్లీ భార్య పేరు ప్రియ. ఈ రోజు ఆమె పుట్టిన రోజు .ఈ సందర్భంగా అట్లీ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసాడు. నేను ఓ అమ్మాయి కావాలని దేవుడ్ని అడిగాను కానీ ఆ దేవుడు నా భార్య రూపంలో నాకొక దేవతను ఇచ్చాడు.ఈ దేవత వల్లే నా కోరికలు కలలు నిజం అయ్యాయి అని రాసుకొచ్చాడు. అలాగే నువ్వే నా సర్వస్వం ఇప్పుడు మనకు ఓ చిన్న ఫ్యామిలీ ఏర్పడింది. నేను మీర్ కలిసి నీకు బర్త్ డే విషెస్ చెబుతున్నాం అంటు తన భార్యతో ఉన్న ఫోటోలను అట్లీ షేర్ చేశాడు.ఇప్పుడు అట్లీ వ్యాఖ్యలతో పాటు పిక్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

అట్లీ చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అధికారకంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా కూడా విజయ్ ,షారూక్ ల మల్టి స్టారర్ ని అట్లీ తెరకెక్కిస్తాడని అందరు అంటున్నారు. ఇది వరకే ఈ కాంబోలో సినిమా ఉంటుందని అట్లీనే స్వయంగా చెప్పాడు. భారత దేశ వ్యాప్తంగా పేరు సంపాదించిన తమిళ దర్శకులైన మణి రత్నం,శంకర్ ల సరసన కూడా అట్లీ నిలిచాడు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .