English | Telugu

అల్లు అర్జున్ కి ముహూర్తం కుదరలేదా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ఎప్పుడూ మొదలుపెడతారు? ఈ మూవీపై అల్లు అర్జున్ అంత శ్రద్ధ చూపించడం లేదా? మరి ఎందుకు ఇంత ఆలస్యం. ఒకపక్క ఇతర హీరోలు ముహూర్తాలు బాగున్నాయి అంటూ తమ షూటింగ్ లు కూడా మొదలుపెట్టేశారు. అందరి కంటే ముందే మూవీ అనౌన్స్ చేసిన బన్నీ మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. ఈ విషయం మెగా ఫ్యాన్స్ ని కొంచెం కలవరానికి గురిచేస్తోంది. జాలాయి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి. ఇందులో తొలిసారి బన్నీ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే సమంతని తీసుకోగా...మరో ఇద్దరినీ ఎంపిక చేయాల్సి వుంది. అలాగే ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ చేస్తున్న న్యూస్ ఇటీవల బయటకి వచ్చింది. అయితే ఫ్యాన్స్ కి కావల్సిన అసలు న్యూస్ ఇంకా అందించలేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.