English | Telugu
బోయపాటితో అల్లు అర్జున్... రూల్స్ అప్లై!
Updated : Feb 8, 2023
ఒక దర్శకునితో ఒక స్టార్ హీరో చిత్రం చేస్తున్నాడు అంటే ఆ ముందు చిత్రం ఆదర్శకునికి కచ్చితంగా పెద్ద హిట్ అయి ఉండాలనేది తెలుగు సినీ సాంప్రదాయం. హిట్టు మీదున్న దర్శకులతోనే మన స్టార్లు పనిచేస్తారు. మీడియం రేంజ్ హీరోలతో హిట్లు కొట్టి తమను తాము ఎప్పుడు నిరూపించుకుంటూ ఉండాలి. అంతేగానీ వారిద్దరు గతంలో బ్లాక్ బస్టర్ ఇచ్చినా సరే అది లెక్కలోకి రాదు. వాస్తవానికి బోయపాటి శ్రీనివాస్ తో బన్నీకి సరైనోడు వంటి మాసివ్ హిట్ ఉంది. ఆ చిత్రం చూసి బన్నీ బోయపాటికి చాన్స్ ఇవ్వవచ్చు. కానీ అలా ఇవ్వరు. తాజాగా బోయపాటి మరో హీరోతో నిరూపించుకుంటేనే అతనికి చాన్స్ లభిస్తుంది. ఇలా తమను తాము నిరూపించుకుంటేనే వారికి మన స్టార్స్ అవకాశం దక్కుతుంది. లేదంటే లేదు. ఇక పుష్పా చిత్రంతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారి నేషనల్ ఐకాన్ గా మారారు. పుష్ప1 ది రైజ్ తోనే తన సత్తా ఏంటో ఏంటో పాన్ ఇండియా లెవెల్ లో చూపించారు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఘన విజయం సాధించింది. 100 రూపాయల పెట్టుబడికి 400 రూపాయల లాభాలను అందించింది. దాంతో పుష్ప2 ది రూల్ చిత్రంపై బన్నీతో పాటు సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పుష్పా1 ది రైజ్ చిత్రాన్ని కేవలం పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే తీశారు. కానీ పుష్పా2ని ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి రీచ్ అయ్యేలా తీయాలని సుకుమార్ పట్టుదలతో ఉన్నారు. ఇక పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి చిత్రాలు చేస్తారు? ఎవరితో చిత్రాలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీనివాస్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు చిత్రం ఘన విజయం సాధించింది. మాసివ్ హిట్టుగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం యూట్యూబ్ లో బాలీవుడ్ లో కూడా షేక్ అయ్యేలా వ్యూస్ని సాధించింది. దాంతో బన్నీ- బోయపాటి చిత్రమంటే ఊర మాస్ చిత్రంగా అందరూ భావిస్తారు. కాబట్టి బోయపాటి శ్రీను తో చిత్రం చేయడానికి అల్లు అర్జున్ ఓ కండిషన్ పెట్టాడట. ప్రస్తుతం బోయపాటి శీను రామ్ పోతినేనితో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు.
ఇందులో ఏకంగా 300 మంది ఫైటర్లతో హీరో పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బోయపాటి బాలయ్యకు డ్యూయల్ రోల్స్ పరంగా మూడు వరుస హిట్స్ ఇచ్చారు. సింహ, లెజెండ్, అఖండాలతో హ్యాట్రిక్ పూర్తి చేశారు. దీంతో ఇదే ఫార్ములాని బన్నీతో కూడా అప్లై చేయాలని బోయపాటి భావిస్తున్నారు. తన చిత్రంలో బన్నీని ద్విపాత్రాభినయంలో చూపించడానికి బోయపాటి కసరత్తు చేస్తున్నారని సమాచారం. మొత్తానికి రామ్ పోతినేని తో బోయపాటి చేస్తున్న చిత్రం ఫలితం మీదనే బన్నీ- బోయపాటిల కాంబినేషన్ ఉంటుందా? లేదా? అనేది తేలనుంది.