English | Telugu

హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయిన ఫైర్‌బ్రాండ్‌

ముసుగువేయొద్దు మ‌న‌సు మీద అనేది కంగ‌న ర‌నౌత్‌కి ప‌క్కాగా సూట్ అయ్యే కొటేష‌న్‌. ఆమె మ‌న‌సుకే కాదు, నోటికి కూడా ఎప్పుడూ ఫిల్ట‌ర్ వేయ‌రు. మ‌న‌సులో ఏం అనిపిస్తే దాన్ని, డైర‌క్ట్ గా చెప్పేస్తూ ఉంటారు. సోష‌ల్ మీడియాలో అయితే ఆమె ప్ర‌తి పోస్టూ వైర‌ల్ కావాల్సిందే. అంత‌గా పాపుల‌ర్ అయ్యారు కంగ‌నా ర‌నౌత్‌. కేసినోవా, అత‌ని భార్యా త‌న మీద స్పై చేస్తున్నార‌ని కూడా చాలా సార్లు చెప్పారు కంగ‌నా ర‌నౌత్‌. ఆ వివాదం ఓ వైపు కొన‌సాగుతూనే ఉంది. ఇంతలో ఫైర్‌బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు త‌ను వెడ్స్ మ‌ను ఆర్టిస్ట్ కంగ‌న‌. ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు కంగ‌న‌. గ్రీన్ శారీ, మినిమ‌ల్ మేక‌ప్‌తో కెమెరాకు ఫోజులిచ్చారు. చంద్ర‌ముఖి2 కోసం ఇప్పుడే హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయ్యాన‌ని పోస్ట్ పెట్టారు.

జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా త‌లైవి. ఆ సినిమా త‌ర్వాత కంగ‌న చేస్తున్న సౌత్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాలో లారెన్స్ కీ రోల్ చేస్తున్నారు. ర‌జ‌నీకాంత్‌, న‌య‌న‌తార‌, జ్యోతిక న‌టించిన చంద్ర‌ముఖి సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమ‌లో చంద్ర‌ముఖిగా క‌నిపిస్తారు కంగ‌న‌. అందుకే డ్యాన్స్ కూడా గ‌ట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. ఎమ‌ర్జెన్సీ సినిమాలోనూ న‌టిస్తున్నారు కంగ‌న‌. ఆ సినిమాను ఆమే డైర‌క్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 20న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు న‌టించిన అనుప‌మ్ ఖేర్‌, కంగ‌న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఎయిర్‌ఫోర్స్ పైల‌ట్‌గా తేజ‌స్‌లో న‌టిస్తున్నారు కంగ‌న‌.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.