English | Telugu

కలసి డ్యూయెట్ పాడిన అల్లు అర్జున్, తమన్నా

కలసి డ్యూయెట్ పాడిన అల్లు అర్జున్, తమన్నా. అందులో తప్పేముంది అల్లు అర్జున్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, వినాయక్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ చిత్రం"బద్రీనాథ్"లో వాళ్ళిద్దరు కలసి నటిస్తున్నారు కనుక ఒక డ్యూయూట్ ఏం ఖర్మ మూడో నాలుగో డ్యూయెట్లు పాడుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళిద్దరూ "బద్రినాథ్" సినిమా కోసం కలసి డ్యూయెట్ పాడలేదు. నాగచైతన్య "100% లవ్" చిత్రం ఆడియో రిలీజ్ రోజుల ఆ చిత్రంలోని పాటను, ఆ చిత్ర సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తో కలసి పాడటం విశేషం.

విషయంలోకి వస్తే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం "100% లవ్". ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఏప్రెల్ 11 వ తేదీన హైదరాబాద్ రాక్ గార్డెన్స్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ పాట పాడుతూ స్టేజీ దిగి అల్లు అర్జున్, తమన్నాల వద్దకు వచ్చి వారితో కూడా ఈ చిత్రంలోని పాట పాడించటం విశేషం. ఆ పాట "కళ్ళూ కళ్ళూ కలిస్తే ప్లస్- వాళ్ళూ వీళ్ళూ మైనస్" ఇలా సాగుతూంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.