English | Telugu

శ్రీకాంత్ "సేవకుడు" నిర్మాతపై ఛీటింగ్ కేస్

శ్రీకాంత్ "సేవకుడు" నిర్మాతపై ఛీటింగ్ కేస్ పెట్టబడిందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీకాంత్ హీరోగా, ఛార్మి, విమలారామన్ హీరోయిన్లుగా "సేవకుడు" చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్ చిక్కడపల్లిలోని ఒక ఫైనాన్సియర్ విజయ శేఖర్ వద్ద నుంచి 40 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆయన అప్పు తిరిగి చెల్లించనిదే "సేవకుడు" సినిమా విడుదల చేసుకోకూడదని అగ్రిమెంట్ కూడా వ్రాసుకున్నారట.

కానీ ఈ "సేవకుడు" నిర్మాత సుధాకర్, జెమిని కలర్ ల్యాబ్ వారు కలసి మరో ఫైనాన్సియర్ వద్ద నుంచి కూడా ఇలాంటి అగ్రిమెంటే వ్రాసుకుని మరో 65 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారట. ఈ విషయం తెలిసిన మొదటి ఫైనాన్సియర్ విజయ శేఖర్ నాంపల్లి మేట్రోపాలిటన్ లో కేసు వేయగా, మేజిస్ట్రేట్ ఆర్డర్ల ప్రకారం "సేవకుడు" నిర్మాతపై ఐపిసి సెక్షన్ 406, సెక్షన్ 420 ల ప్రకారం కేసులు నమోదు చేయబడ్డాయని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సి.ఐ నర్సింగరావు మీడియాకు తెలియజేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.