English | Telugu

ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" రిలీజ్ వాయిదా

ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" రిలీజ్ వాయిదా పడింది. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం"మిస్టర్ పర్ ఫెక్ట్". ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రెల్ 21 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని ఏప్రెల్ 21 వ తేదీన కాకుండా ఏప్రెల్ 22 వ తేదీన విడుదల చేయనున్నామని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు తెలియజేశారట.

యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందుతూంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్' చిత్రమ ఏప్రేల్ 14 వ తేదీన విడుదల కానుండగా, నాగచైతన్య "100%లవ్", రానా "నేను-నా రాక్షసి" ఏప్రెల్ 29 వ తేదీన విడుదల కానున్నాయి.మరి ఈ పోటీని ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఏ విధంగా తట్టుకుంటుందో వేచి చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.