English | Telugu
కిరణ్ అబ్బవరంకి అఖిల్ హ్యాండ్ కలిసొస్తుందా?
Updated : Feb 14, 2023
కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం సాంగ్స్, టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 18 మహాశివరాత్రికి విడుదల కానుంది. శివరాత్రికి విడుదల కావాల్సిన సమంత 'శాకుంతలం', విశ్వక్ సేన్ 'ధమ్కీ' సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో 'వినరో భాగ్యము విష్ణు కథ'తో పాటు ధనుష్ నటించిన 'సార్' చిత్రం మాత్రమే ప్రధానంగా పోటీపడుతున్నాయి. అది ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.
తక్కువ సమయంలోనే మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాడు. దాంతో తాజా చిత్రంపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్నీ బాగా ఆకట్టుకుని సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో అక్కినేని అఖిల్ పాల్గొంటున్నాడు. అక్కినేని అఖిల్ ప్రీరిలీజ్ వేడుకకు రావడం వల్ల ఈ చిత్రానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఈ మూవీ ప్రమోషన్లకు అక్కినేని అఖిల్ రాక ఏమాత్రం ప్లస్ కానుంది? అనే విషయంలో పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. సరైన హిట్ లేకపోయినా అక్కినేని అఖిల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కుటుంబాన్ని అభిమానించే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. దాంతో వారందరి ప్రోత్సాహం ఈ చిత్రానికి ఉండవచ్చని భావిస్తున్నారు.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మురళి శర్మ కీలకపాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్స్ లో బన్నీ వాసు నిర్మించారు. ఒకవైపు శాకుంతలం, ధమ్కీ వాయిదా పడడం, మరోవైపు ప్రీరిలీజ్ వేడుకకు అఖిల్ రావడం ఈ సినిమాకు కలిసొస్తుందని చెప్పాలి. మరి దాన్ని ఈ చిత్రం ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో వేచి చూడాలి.