English | Telugu
నటి జియాఖాన్ తల్లిపై 100 కోట్ల పరువు నష్టం దావా
Updated : Jul 5, 2014
అనుమానాస్పద రీతిలో బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లి రబియా ఖాన్ జియా ఖాన్ మృతి హత్యేనంటూ హైకోర్టులో కేసు వేసి, సిబిఐ విచారణ కావలసిందిగా కోరింది. ఇటీవలే ఈ కేసు సిబిఐకి అప్పగించారు. ఈ నేపథ్యంలో జియాఖాన్ తల్లి రబియా పై ఆదిత్య పాంచోలి 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకటించింది. జియాఖాన్ కేసులో ఆదిత్య పాంచోలి కొడుకు సూరజ్ ఆలోపణలు ఎదుర్కుంటున్నారు. రబియా ట్విట్లర్లో తమపై అమర్యాద పూర్వకమైన వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ లో తమ గౌరవానికి భంగం కలిగిస్తోంది పాంచోలీ కుటుంబం ఈ పిటీషన్లో ఆరోపించింది.