English | Telugu
సీతారామరాజుగా బాహుబలి
Updated : Jul 5, 2014
ఇప్పుడు అందరి చూపు ప్రభాస్ నటిస్తున్న బాహుబలి చిత్రంపైనే వుంది. టాలీవుడ్ సిని చరిత్రకు కొత్త రూపం ఇవ్వనున్న ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ఏ చిత్రంలో నటిస్తాడు అనే ఆలోచన ఆడియన్స్ కు రాకముందే ఆ కబురు చెప్పేశారు కృష్ణంరాజు. రెబల్ స్టార్ పెదనాన్న కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. అదీ చారిత్రక నేపథ్యం వున్న సినిమా కావడం మరో విశేషం. అల్లూరి సీతరామరాజుగా ప్రభాస్ ని చూడాలనుకుంటున్నారట కృష్ణంరాజు. ఆ సినిమాని కృష్ణంరాజు చేయాలనుకున్న అప్పట్లే వీలు పడలేదని, అందుకే ఇప్పుడా చిత్రన్ని ప్రభాస్ తో నిర్మించాలని ఆయన ఆశిస్తున్నారట. బాహుబలి తర్వాత ఈ చిత్రం మొదలు పెట్టే అవకాశం వుందటి. ఏమైనా తెలుగు వీరులను, చరిత్రను ఇలా మరల మరల తెలుగు తెర మీద చూసుకొవడం ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమే.