English | Telugu
శంకర డాటర్‌కి బోలెడన్ని ఛాన్సులు!
Updated : Jul 26, 2023
తండ్రి పేరు చెప్పుకుని అవకాశాలు సంపాదించను అని అంటారు అదితి. అయినా కూడా ఆమెకు శంకర్ డాటర్‌గానే అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తమిళ్‌లో మల్టిపుల్ సినిమాలు చేశారు అదితి శంకర్. తెలుగులో గని సినిమాలో పాట కూడా పాడారు. తన సినిమాల్లో తానే పాటలు పాడుకుంటున్నారు అదితి. రీసెంట్‌గా శివకార్తికేయన్ మావీరన్‌లో నటించారు అదితి. తెలుగులో ఈ సినిమా విడుదలలోనే జాప్యం జరిగింది. ఎక్కడా మార్నింగ్ షోలు పడలేదు. చాలా లేట్‌గా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చే కాసిన్ని ఓపెనింగ్స్ కూడా మాయమయ్యాయి. అయితే తమిళ్‌లో మాత్రం ఓ మోస్తరు పేరు తెచ్చుకుంది మావీరన్. ఆ సినిమా తర్వాత అదితి శంకర్ మరో సినిమాకు సంతకం చేశారు. ఈ సినిమాలో అధర్వ మురళి తమ్ముడు ఆకాష్ మురళితో జోడీ కడుతున్నారు అదితి శంకర్. విష్ణు వర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మన దగ్గర పవన్ కల్యాణ్‌తో పంజా తీసిన డైరక్టరే ఈ విష్ణువర్ధన్. ఇప్పుడు అదితి శంకర్‌తో సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. ఆల్రెడీ చెన్నైలో ప్రారంభోత్సవం జరిగింది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.
ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ని పోర్చుగల్‌లోనూ, లిస్బన్‌లోనూ తెరకెక్కించాలన్నది ప్లాన్. వచ్చే నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ ఉంటుంది. చిన్నప్పుడు వెకేషన్‌కి ఫ్యామిలీతో ఎన్ని దేశాలు తిరిగినప్పటికీ, ఇప్పుడు షూటింగ్ కోసం ఇలా వెళ్లడం ఆనందంగా ఉందని అంటున్నారు అదితి శంకర్. ఆకాష్ మురళి, అదితితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, ఫ్రెష్ టాలెంట్‌తో పనిచేస్తుంటే ఆటోమేటిగ్గా తనకు ఉత్సాహం వస్తోందని అన్నారు డైరక్టర్ విష్ణు. రొమాంటిక్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు డైరక్టర్.
ఈ సినిమా స్థానంలో, అజిత్‌తో ఓ సినిమా చేయాల్సింది విష్ణు వర్ధన్. అయితే, అజిత్ నటించాల్సిన సినిమా కేన్సల్ కావడం, ఆయన మరో సినిమా స్టార్ట్ కావడానికి టైమ్ పడుతుండటంతో, ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. అందుకే ఆ టైమ్‌ని ఇలా యుటిలైజ్ చేసుకుంటున్నారు విష్ణువర్ధన్. ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మాస్టర్ సినిమాను తెరకెక్కించిన నిర్మాణ సంస్థ కావడంతో వెంటనే ఒప్పుకున్నారట అదితి శంకర్.