English | Telugu
చిన్మయి ఇంట్లో సమంత.. పిల్లలతో కలిసి!
Updated : Aug 7, 2023
స్టార్ హీరోయిన్ సమంత, సింగర్ చిన్మయి మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకు కారణం ఇద్దరూ చెన్నైకి చెందినవాళ్లు. అంతే కాదండోయ్. ఇద్దరూ కెరీర్ ప్రారంభంలో కలిసి పని చేశారు. ఏ మాయ చేసావె సినిమాలో సమంతకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది. ఆ వాయిస్‌తో సామ్‌కి ఓ స్పెషల్ క్రేజ్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. అంతే కాదండోయ్..చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకు మంచి ఫ్రెండ్. నాగార్జునతో మన్మథుడు సినిమాను రాహుల్ డైరెక్ట్ చేశారంటే కారణం సమంత అప్పట్లో చేసిన రెకమండేషన్ కూడా బలంగా పని చేసింది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. చైతుతో విడిపోయిన సమంత మియోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆమె సినిమాల నుంచి బ్రేక్ కూడా తీసుకుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక, యోగ, వ్యాయామం స్నేహితులతో టూర్స్‌కి వెళ్లటం వంటి పనులు చేస్తోంది. అయితే తాజాగా ఆమె తన స్నేహితురాలు చిన్మయి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లటమే కాదు.. ఆమె పిల్లలతోనూ ఆటలాడుకుంది. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య సమంతనే తెలుగులోనూ డబ్బింగ్ చెప్పుకోవటం మొదలు పెట్టింది. దీంతో ఆమెకు, చిన్మయిక మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు కూడా రాకపోలేదు.
అయితే ఇప్పుడు చిన్మయి ఇంటికి సమంత వెళ్లింది. దీంతో స్నేహితుల మధ్య పొరపచ్చాలున్నాయనే వార్తలకు బ్రేక్ పడ్డట్టు అయ్యాయని చెప్పాలి. సినిమాలకు బ్రేక్ తీసుకున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన విషయాలను ఫొటోల రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఖుషి సినిమా రిలీజ్ కానుంది.