English | Telugu
జనసేనానిపై ఆది కామెంట్స్..చెమ్మగిల్లిన చిరు కళ్ళు!
Updated : Aug 7, 2023
బోలా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముగ్గురన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గురించి తనదైన మార్క్ పంచులతో వాళ్ళను తెగ పొగిడేసాడు ఆది. "కొంతమంది తెలివైన శాడిస్టులు ఉంటారు. అన్నయ్య చిరుని పొగిడేసి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ని తిట్టేస్తారు. తమ్ముడిని తిడుతూ ఉంటే సంతోష పడే వ్యక్తా చిరంజీవి అని ప్రశ్నించారు ఆది. బోళా శంకర్ సెట్ లో పొలిటికల్ టాపిక్ వచ్చినప్పుడు నేను చిరు గారిని ఒక ప్రశ్న అడిగాను అప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఈ మధ్య పొలిటికల్ న్యూస్ చూడడం లేదు..ఎవరు పడితే వాళ్ళు నా తమ్ముడిని తిడుతున్నారు..అది చూసి తట్టుకోలేకపోతున్నా అని అన్నారు. ఇది అన్నయ్యకు తమ్ముడి మీద ఉన్న ప్రేమ.
ఇక తమ్ముడికి అన్నయ్య మీద ఎంత ప్రేమ అంటే అన్నయ్యను అవమానించినవాళ్లను ఆయన వదిలేశారేమో కానీ గుర్తుపెట్టుకుని తమ్ముడు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు.. చిరంజీవి గారు అభిమానులను ప్రేమిస్తాడు, శత్రువులను సైతం క్షమిస్తాడు. కొంతమంది చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారితో పోల్చి నాగబాబు గారిని తక్కువ చేసి మాట్లాడతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి వలన ఎంతమంది ఎదిగారో టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారి వల్ల నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఎదిగారు. అన్నయ్య చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారు కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మొండోడు ముంచడాలు ఉండవ్ , తాడో పేడో తెంచడాలే..డబ్బు మీద ఆశ లేకుండా మంచి చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళ మీద తప్పుడు రాతలు రాసినా, తప్పుడు కూతలు కూసినా కుర్చీ మడత పెట్టి...అని మిగతాది చెప్పకుండానే అది జరుగుతుందన్నమాట. ఇది తెలియాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి..కింది స్థాయి వాళ్లకు అర్ధం కాదు" అన్నారు ఆది.