English | Telugu
చెర్రీ సినిమాకు రెహమాన్ సంగీతం...?
Updated : Mar 4, 2014
హిందీలో రామ్ చరణ్ నటించిన "తుఫాన్" చిత్రం అట్టర్ ఫ్లాప్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో మళ్ళీ ప్రయోగాల వైపు వెళ్ళకూడదని అప్పట్లో చరణ్ నిర్ణయం కూడా తీసుకున్నాడు. అయితే తాజాగా మరో హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
హిందీలో "స్వదేశ్", "లగాన్", "జోధా అక్బర్" వంటి చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఏ.ఆర్.రెహమాన్ ను సంప్రదించారట. ఇంకా రెహమాన్ ఎలాంటి నిర్ణయం చెప్పలేదని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాలో చరణ్ బిజీగా ఉన్నాడు. అలాగే తన తరువాతి సినిమా బోయపాటితో చేయనున్నాడు. మరి ఈ హిందీ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళనుందో త్వరలోనే తెలియనుంది.