English | Telugu
విక్రమ్ తో జతకట్టనున్న హన్సిక
Updated : Mar 4, 2014
తమిళంలో ధరణి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. చాలా మంది హీరోయిన్లను అనుకున్నప్పటికీ చివరికి హన్సికనే సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి హన్సిక చేతిలో దాదాపు ఎనిమిది చిత్రాల వరకు ఉన్నాయి. తెలుగులో ప్రస్తుతం రవితేజ, నాగచైతన్య, రామ్ చిత్రాలలో నటిస్తుంది. విక్రమ్ నటిస్తున్న "ఐ" చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత ధరణి సినిమా ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా హన్సికకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.