English | Telugu

ఫేస్‌బుక్ బాహుబలి రాజమౌళి


టాలీవుడ్‌లో రాజమౌళికున్న ఇమేజ్ ప్రత్యేకం. ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి గురించి కాకుండా మరో విషయం వలన టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారారు జెక్కన్న. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో రాజమౌళి చాలా పాపులర్. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తు, ఇంట్రస్టింగ్ ఫేస్‌బుక్ పేజ్ రన్ చేస్తున్న టాలీవుడ్‌ పర్స్‌నాలిటీ రాజమౌళి. తాను రూపొందించిన సినిమాలకు ప్రేక్షకులతో నూటికి నూరు శాతం మార్కులు వేయించుకునే ఈ మిస్టర్ పర్‌ఫెక్ట్ డైరెక్టర్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా 2 మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు.


స్టార్ హీరోలకు, హీరోయిన్లకు ఇలా లక్షల్లో అభిమానులుండటం మాములే. కానీ దర్శకులలో 20 లక్షల మంది అభిమానులున్న దర్శకుడు మరెవరు లేరు. సినిమా ప్రమోషన్, మేకింగ్ లోనే కాదు అభిమానులను సంపాదించుకోవడంలో, వారితో రాపో మెయిన్‌టేయిన్ చేయడంలోను రాజమౌళి పర్‌ఫెక్ట్ అని అర్థమవుతోంది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.